శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

BB6 TELUGU NEWS CHANNEL
యుగయుగాల నుండి ఎందరో ఆధ్యాత్మిక సాధకులకు, మోక్ష సాధకులకు, సకల దేవతలకు నిలయం శ్రీశైలం. శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లు కొలువైన ఈ క్షేత్రం అష్టాదశశక్తి క్షేత్రాలలో ఆరో క్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ క్షేత్రం. భూమండలానికి నాభిస్థానం. ఇలలో వెలసిన కైలాసం. కోరినవన్నీ అనుగ్రహించే క్షేత్రం. ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య విశ్వం అనే పద్మంలో ఉండే కేసరాలను మించి ఉంటుందని పురాణాలు చెబుతుంటాయి.

శ్రీశైలంలో ప్రతి ఏడాది సంక్రాంతికి ఒకసారి, మహాశివరాత్రికి మరోసారి చొప్పున రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగటం విశేషం. కన్నుల పండువగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఫిబ్రవరి 08 నుండి 18 వరకు జరగనున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe