అమ్మవారి సన్నిధిలో నూతన సర్పంచ్ దంపతులు.బల్కంపేట ఎల్లమ్మ ను దర్శించుకున్న స్వప్న భూపాల్ రెడ్డి.

BB6 TELUGU NEWS CHANNEL
కేశంపేట, ప్రముఖ దేవాలయం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని పోమాల్ పల్లి గ్రామ సర్పంచ్ బుర్రి స్వప్న భూపాల్ రెడ్డి దంపతులు గురువారం ద‌ర్శించుకున్నారు.ఇందులో భాగంగా పోమాల్ పల్లి వాస్తవులైన పండితులు గౌరవ రంగాచార్యులు ఆధ్వర్యంలో దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,రంగాచార్యులు  ఆశీర్వాదం తీసుకోవడం జరిగిందన్నారు.అనంతరం పండితులు రంగాచార్యులు సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యులను సన్మానించారు.ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ,,,అమ్మవారి చల్లని చూపు గ్రామ ప్రజలపై ఉండి,గ్రామ ప్రజల సంక్షేమం,శాంతి, అభివృద్ధి దిశగా తమ పాలన మరింత సజావుగా సాగాలని,అలాగే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తమకు మరింత బలం ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు.బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉప సర్పంచ్ భూపాల్ రెడ్డి,వార్డు సభ్యులు కే.రాఘవేందర్ రాధికా దంపతులు,యువకులు బండ కృష్ణయ్య యాదవ్,వారి తనయులు ఉన్నారు…

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe