పార్టీలకతీతంగా గెలుపు కోసం కృషి చేద్దాం...
.వచ్చిన అవకాశం వదలొద్దు.బీసీ జనసేన నియోజకవర్గం అధికార ప్రతినిధి స్రవంతి రాజ్ పిలుపు.
షాద్ నగర్ మున్సిపాలిటీ
BB6 TELUGU NEWS CHANNEL
పార్టీలకతీతంగా కలిసి గెలుపు కోసం కృషి చేద్దాం,నిలబడి గెలవండి..విజయంతో మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిస్తున్నారు బీసీ జనసే నియోజకవర్గం అధికార ప్రతినిధి స్రవంతి రాజ్…రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలకు మహాత్తరమైన అవకాశం వచ్చిందని,ప్రతి వార్డులో బీసీలు నిలబడి గెలవాలని అంటూన్నారు.ఈ సందర్బంగా మీడియా ద్వారా అధికార ప్రతినిధి స్రవంతి రాజ్ మాట్లాడుతూ,,,వార్డులలో గెలవడానికి ఇదొక సువర్ణావకాశం అన్నారు.బీసీలు ఇద్దరు,ముగ్గురు నిలబడతే విజయం దక్కకపోగా,డబ్బులు వృధా అవుతాయాని అన్నారు.పార్టీ నుండి కాకున్నా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన వారికి మద్దతుగా ఉండి గెలిపించుకోవల్సిన అవసరం ఉందన్నారు.అవకాశం లేని చోట రెబల్ గా నిలబడి డబ్బులు వృథాగా ఖర్చు చేసుకొని అప్పుల పాలు కావోద్దు,బీసీలకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,డబ్బులు ఖర్చు చేసి దుర్వినియోగం చేసుకోవద్దని కోరారు.బీసీలందరూ ఏకంకండి పార్టీ పరంగా వచ్చిన టికెట్లని స్వీకరించి ఏ పార్టీ నుంచి అయినా సరే పని చేసి న్యాయ బద్ధంగా,చట్టబద్ధంగా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లలో వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరచుకోకుండా సమన్వయంతో ఉండి చట్టానికి న్యాయానికి కట్టుబడి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నియోజకవర్గం అధికార ప్రతినిధి స్రవంతి రాజ్…