బాల్క సుమన్ ఓ రౌడీ షీటర్లా రెచ్చిపోయారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

BB6 TELUGU NEWS CHANNEL
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఓరౌడీ షీటర్ లా రెచ్చిపోయాడని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక క్రమంలో బాల్క్ సుమన్,అతని అనుచరులు రౌడీల్లా ప్రవర్తించారని పోలీసులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు.

చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బాల్క సుమన్ ఆధ్వర్యంలో బీ ఆర్ ఎస్  నేతలు, కార్యకర్తలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న పోలీసును వంశీకృష్ణ పరామర్శించారు.సికింద్రాబాద్ లోని అపోలో కు వెళ్లి కానిస్టేబుల్ రాకేష్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

మద్యం మత్తులో రౌడీ షీటర్ లా బాల్కసుమన్, ఆయన అనుచరులు మహిళా పోలీసులు అని చూడకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా పోలీసులపై దాడి చేసారని ఎంపీ వంశీకృష్ణ ఆరోపించారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe