BB6 TELUGU NEWS CHANNEL
గ్రూప్–1 ఆఫీసర్లుగా ఎంపికైన అధికారులను వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్ మరియు వారి దంపతులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారి కృషి, పట్టుదలను ప్రశంసిస్తూ శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.
ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా వారు మండల పరిధిలోని కప్లాపూర్ గ్రామం ను సందర్శించారు. గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
అనంతరం వారు గట్టు చెన్నకేశవ స్వామి దేవస్థానం ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని, శ్రేయోభిలాషులతో కలిసి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని దేవుని ఆశీస్సులు కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో గండీడ్ తహసిల్దార్ మల్లికార్జున్ రావు ఎంపీఓ హరిశ్చంద్రారెడ్డి , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, గండీడ్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సర్పంచ్ భగవంత్ రెడ్డి సర్పంచులు , టిక్యా కార్యదర్శి శోభా, aeo వరలక్ష్మి, పలువురు నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
1.Regatte sai kiran reddy (DSp)2.Dr.M. Soumya Sri(Excise DSp)
3.B. Suchitha (Excise DSP)
4.Dharavath Sabitha (DSP)
5.B. Shiva Kumar (DSP)
6.Dr. V. M. Niveditha (Excise DSP)

