వరస దొంగతనాలతో మేకల దొంగల అరాచకం పోలీసులకు సవాల్..

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శేఖర్ రెడ్డి కథనం ప్రకారం నిన్న శుక్రవారం కుల్కచర్ల మండలం చికర్ల బండ తండా దారిలో గల షెడ్డులో రాత్రి షెడ్డులో ఉంచిన సుమారు 30 నుంచి 40 మేకలని అపహరించిన దొంగలు. సంఘటన జరిగిన 24 గంటల్లోపు గండీడ్ మండలం రంగారెడ్డి పల్లి గ్రామంలో మరో దొంగతనం వెలుగులోకి వచ్చింది.రంగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన మేకల పాపయ్య అనే వ్యక్తి వద్ద 15 మేకలను తన ఇంటి పక్కన ఉన్న షెడ్డులో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు షెడ్లలో మేకలను ఉంచి రాత్రివేళ తన ఇంట్లో పడుకున్నాడు. ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు లేచి చూసేసరికి అతని షెడ్డులో ఉంచిన మేకులను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్టు తెలిసింది. ఈ మేరకు పాపయ్య  కొడుకు శ్రీకాంత్ ఇచ్చిన మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన పోలీసులు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe