BB6 TELUGU NEWS CHANNEL
అన్నపురెడ్డిపల్లి విద్యావేత్త, హరిహర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణ వ్యవస్థాపకులు మారగాని శ్రీనివాసరావు శనివారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో హరిహర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే మండల అవతరణ దశాబ్ది ఉత్సవాలు, సంక్రాంతి సంబరాల గోడపత్రికలను ఆవిష్కరించారు. హరిహర ఫౌండేషన్ వారు గ్రామాల్లో సాంప్రదాయ ఉత్సవాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని, ప్రశాంతమైన వాతావరణం లో ఉత్సవాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయాలని, ముందస్తుగా మండల ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు పిసిసి అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ కుమార్ , కొమరయ్య, సమన్వయకర్త మచ్చ వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
గోడ పత్రికలను ఆవిష్కరించిన పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
10
Jan