కేవలం నిరసన కాదు, ఆత్మగౌరవ పోరాటం. BC ల జస్టిస్ బంద్‌కు బిజెపి సంపూర్ణ మద్దతు డా. వెన్న ఈశ్వరప్ప

BB6 TELUGU NEWS CHANNEL
బిసిలకు న్యాయం జరగాలని బిసి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన Bandh for Justice లో భాగంగా రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, మొకిల గ్రామంలో ఈరోజు బంద్‌లో పాల్గొనడం జరిగింది. బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ, బిజెపి నాయకులతో కలిసి మన ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.వెన్న ఈశ్వరప్ప గారు నిరసన తెలియజేశారు.*

⏭️ *డా.వెన్న ఈశ్వరప్ప మీడియాతో మాట్లాడుతూ. మనం పోరాడుతున్నది, కేవలం రిజర్వేషన్ల కోసం కాదు, మన ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాం.
భారత రాజ్యాంగం ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో 60% పైగా జనాభా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసి, రిజర్వేషన్లు ఇస్తామని, కొన్ని శక్తుల ద్వారా కోర్టుకు వెళ్లి, బీసీల హక్కులను కాలరాశారు.
కోర్టు స్టే తీసుకురావడం అనేది బీసీల భవిష్యత్తును అంధకారం చేయడమే. ఇది సామాజిక న్యాయానికి విఘాతం.
*•* బీసీల రిజర్వేషన్ పై స్టే వచ్చినప్పుడు, దీనిని నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వైఫల్యమైంది?
ప్రభుత్వం ఈ విషయంలో చిత్తశుద్ధి చూపాలి. లేదంటే, ఈ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉద్ధృతం చేస్తాం అని డిమాండ్ చేశారు.

➡️ *ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షురాలు లీలావతి బయ్యనంద్ గారు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి. రాములు గారు,మాజీ జాతీయ కౌన్సిల్ ఎల్. ప్రభాకర్ రెడ్డి గారు,రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు వాసుదేవ కన్నా గారు, అధ్యక్షులు, చేవెళ్ళ బీసీ సంక్షేమ సంఘం వెంకటేశం గారు,బయ్యనంద్, బీర్ల నర్సింహ, యాదయ్య, రాజా చంద్ర, కృష్ణ, షణ్ముఖేష్, రాజేష్, కరుణాకర్, వెంకటేష్, సంతోష్ కుమార్ తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

BCలకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం ఆగదు!

శంకర్‌పల్లి మండలం లో డా. వెన్న ఈశ్వరప్ప

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe