తెలంగాణలో 26.. ఏపీలో 38 ఎంపీ సీట్ల పెంపుపై అమిత్ షా క్లారిటీ

BB6 TELUGU NEWS CHANNEL
డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్షా.. నియోజకవర్గాల పునర్విభజనపై లోక్సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షామాట్లాడుతూ. ప్రతిపక్షాలు చేస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలని..డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలను తీవ్రంగా ఖండించారు.

అమిత్ షా వెల్లడించిన అంచనాల ప్రకారం.. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న129 ఎంపీ సీట్ల నుంచి ఏకంగా 195(23.97 శాతం)కు పెరగనున్నాయి. తమిళనాడులో 39 స్థానాల నుంచి 59కి(7.23%) పెరగనున్నాయి. కర్ణాటకలో 28 నుంచి 42 సీట్లకు (5.14%) పెరుగుతాయి. కేరళలో 16 నుంచి 20 (3.67%)స్థానాలకు పెరగనున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే రెండు రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం ఉన్న 42 సీట్లు 64కు పెరుగుతాయని అమిత్ షా ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 25 సీట్ల నుంచి 38కి (4.65%) పెరుగుతాయని.. తెలంగాణలో 17 సీట్లనుంచి 26 (3.67%) కు పెరగనున్నాయని చెప్పారు. కేవలం సీట్ల పెంపు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా జరగబోయే జాతీయ జనాభా గణనలో భాగంగా కులగణనను కూడా నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి ఈ సందర్భంగా ప్రకటన చేశారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe