గండీడ్ MRO బ్రహ్మరౌతూ మల్లికార్జునరావుకు వినతి పత్రం అందజేసిన TGEJAC

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల తహసిల్దార్ బి మల్లికార్జునరావుకు వినతి పత్రం అందజేసిన TGEJAC :
వినతి పత్రం :
తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక మరియు పెన్షనర్స్ జాయింట్ యాక్షన్కమిటీ – ఉద్యోగుల దీర్ఘకాలంగా పెండింగ్లో వున్న (4) ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని – వినతిపత్రం సమర్పించుట గురించి.TGEJAC రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి కార్యనిర్వాహక సమావేశం .

తెలంగాణ రాష్ట్రంలోని 15.25 లక్షల ఉద్యోగుల యొక్క 206సంఘాలకు సంబంధించిన తెలంగాణ ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మికుల మరియు పెన్షనర్స్ (TGEJAC) యొక్క రాష్ట్రవిస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో తీసుకున్న తీర్మానాల మేరకు దశలవారి ఆందోళనలలో భాగంగా అన్ని (33) జిల్లాల్లో హైదరాబాద్ సిటీ(HOD) లో, సెక్రటేరియట్తో కలిపి యావత్ తెలంగాణలో గల సమస్త మండల కార్యాలయాలలో, డివిజన్ కార్యాలయాలలో, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో సంబంధిత అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలిక పెండింగ్ (4) ప్రధాన సమస్యలను పరిశీలించి, వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

1.. (2)వ పి.ఆర్.సి. కమిషన్ రిపోర్ట్ తెప్పించి జూన్ 2 లోపు అమలు చేయాలి :పి.ఆర్.సి. కమిటీ ఏర్పాటుచేసి దాదాపుగా 30 నెలలు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు 51% ఫిట్మెంట్లో తెలంగాణలో 2వ పి.ఆర్.సి.ని అమలు చేయాలని, పి.ఆర్.సి. కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొడిగించవద్దని పి.ఆర్.సి. నివేదికను వెంటనే తెప్పించి, జూన్ 2లోపు అమలుచేయాలి. లేనట్లయితే TGEJAC కార్యాచరణ ఉంటుందని ప్రభుత్వానికి తెలియజేశారు.

2. పెండింగ్ బిల్లుల విడుదల

ప్రభుత్వం పెండింగ్ బిల్లులు నెలకు రూ॥ 700 కోట్లు విడుదల చేసినప్పటికీ, రాష్ట్రంలో నెలకు సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్అపుతుండటంతో బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. కాప్పున ఏకమొత్తంగా పెండింగ్ లోపున్న రూ॥ 13,000 కోట్లు వెంటనే ఏకమొత్తంగావిడుదల చేసి పెన్షనర్స్ కుటుంబాలు ఇబ్బందులు పడకుండా చూడాలి.

3. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య కార్డులు మంజూరు….

ఉద్యోగుల ఆరోగ్యకార్డులపై మంత్రివర్గ ఉపకమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నప్పటికీ దీన్ని వెంటనే అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పలుమార్లు TGEJACతో జరిపిన సమావేశాలలో చెబుతున్నప్పటికీ అమలుకావడం లేదు. దీనివల్ల ఉద్యోగులు పెన్షనర్లు అనేకఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త EHS స్కీం విధివిధానాలను వెంటనే రూపొందించి మే 1వ తేదీ నుండి ఉద్యోగులు మరియు పెన్షనర్లకువైద్యసేవలు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలి.

4.A) రాష్ట్రంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ (CPS)ను రద్దుచేసి పాత పెన్షన్ స్కీం (OPS) ను పునరుద్ధరణ చేయాలి. B) 01-09-2004 కంటేముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు వెంటనే పాత పెన్షన్ స్కీం (OPS) ను అమలు చేయాలి
ప్రధాన డిమాండ్లతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన, మిగిలిన దీర్ఘకాలికంగా ఉన్న (64)అంశాలలో పెండింగ్లోవున్న వాటిని సత్వరమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

వినతి పత్రాన్ని అందజేస్తున్న TGEJAC
Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe