బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై హైకోర్టు సంచలన ఆదేశాలు..!

BB6 TELUGU NEWS CHANNEL
బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 తో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా స్టే విధించింది. బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు లో సుదీర్ఘ వాదనలు జరిగాయి. తొలి రోజు పిటీషనర్ల వాదన లు జరిగాయి. ఈ రోజు ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సమగ్ర సర్వే చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ నిర్ణయించిందని చెప్పారు. బీసీ బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదని గుర్తు చేశారు. దీంతో వాదనల తరువాత కోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

బీసీ రిజర్వేషన్లు.. స్థానిక ఎన్నికల పైన హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ల అంశం పైన హైకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన రెడ్డి సుదీర్ఘంగా తన వాదనలు కొనసాగించారు. డోర్ టు డోర్ సర్వేకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారమే సర్వే జరిపామని చెప్పుకొచ్చారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తరువాత నిలుపుదల చేసే అవకాశం లేదని పేర్కొన్నారు.

బీసీ రిజర్వేషన్లు చేసిన విధానాన్ని కోర్టుకు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలిందని హైకోర్టుకు ఏజీ సుదర్శన్‌రెడ్డి వివరించారు. సర్వే డేటా ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశారని పేర్కొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ నిర్ణయించిందని చెప్పారు.

దీనికి కొనసాగింపుగా..బీసీ బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదని గుర్తు చేశారు. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపలేదు కాబట్టి.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టే అని వివరించారు. ఒకవేళ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఉంటే.. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేదని అన్నారు. మార్చి నుంచి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉందని తెలిపారు. గవర్నర్ గడువులోపు ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందని సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందా అని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. ఆమోదించిందని సమాధానం ఇచ్చారు. వాదనల తరువాత హైకోర్టు రిజర్వేషన్ల పైన జారీ చేసిన జీవో నెంబర్ 9 తో పాటుగా ఈ జీవో ఆధారంగా జారీ చేసిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పైన స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe