BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేట గ్రామంలో సుమారు 8 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ (ATC) భవన నిర్మాణానికి కార్మిక మరియు గనుల శాఖ మంత్రివర్యులు డా. వివేక్ వెంకటస్వామి గారు భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ –
“కొడంగల్ నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టవంతులు. ఐటీఐలను ఆధునీకరించి, అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చి గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మన ప్రభుత్వ లక్ష్యం. పదవ తరగతి పాసైన యువతీ యువకులకు ఏటీసీ సెంటర్లలో శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ యువత ఉపాధి కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యావంతులకు, ఏటీసీ సెంటర్ల ద్వారా గ్రామీణ యువతకు శిక్షణ మరియు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రయోజనం కలుగుతుంది.
టాటా గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకుని సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.4 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేట గ్రామంలో 8 కోట్ల వ్యయంతో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్
04
Sep