గండీడ్ బీసీ బాలుర వసతిగృహం లో పిల్లల భద్రతకై మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

BB6 TELUGU News CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు…
మహమ్మదాబాద్ పోలీసులు డ్రగ్స్ రహిత మహబూబ్ నగర్ – మన అందరి ధ్యేయం అనే నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
గండీడ్ ప్రభుత్వ బీసీ హాస్టల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎస్ఐ శేఖర్ రెడ్డి హాజరయ్యారు.

విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన చర్యలపై వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, వినియోగించినా 112 కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమానికి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ( సర్పంచ్ ) రేగరి భగవంతు రెడ్డి, హాస్టల్ వార్డెన్ కృష్ణయ్య, మాలేల జగన్ గౌడ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.