BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలంలోని, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ,అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక సర్పంచ్ రేగరి భగవంత్ రెడ్డి మరియు, గండీడ్ మండల ఎమ్మార్వో, రాజగోపాల్ కలిసి పాఠశాలకు వెళ్లి ,వసతులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల హాజరు రిజిస్టర్, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన మెనూ, నాణ్యతను పరిశీలించారు. వంటగది, బియ్యం నిల్వలు, కూరగాయలను తనిఖీ చేశారు. బాలికల వసతి గృహంలో పడకలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడిన అధికారులు చదువు ఎలా సాగుతుంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.
Related News
పన్నీర్ కల్తీదారులపై కొరడా! దేశవ్యాప్త దాడులకు ఆదేశం
విజయ తెలంగాణ డైరీ పార్లర్ గండీడ్
ఆర్డర్ పై ప్రోడక్ట్ లభించును
యోగాసన ఛాంపియన్‌షిప్‌లో గండీడ్ ముద్దుబిడ్డ మోక్షిత గౌడ్ ప్రతిభ
గండీడ్‌లో ఘనంగా SGF మండల స్థాయి క్రీడోత్సవాలు.. విజేతలుగా నిలిచిన విద్యార్థులు
డివైడర్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహనం: వ్యక్తికి తీవ్ర గాయాలు.108 సిబ్బంది సత్వర సేవ
కూకట్పల్లి JNTU పరిధిలో అర్ధరాత్రి విద్యార్థుల మధ్య భీకర ఘర్షణ – రాళ్లు, కర్రలతో దాడులు
జిల్లా వ్యాప్తంగా 30-పోలీస్ యాక్ట్ అమలు- మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్
యాదాద్రి జిల్లా భువనగిరిలో ఉద్రిక్తత – ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ పై బీజేపీ దాడి, బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ ప్రతీకార దాడి!
తెలంగాణలో బిగ్ షాక్! కేబినెట్ నుంచి కొండా సురేఖ సహా నలుగురు ఔట్!
గండీడ్ మినీ గురుకులంలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం – పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా విద్యార్థినుల ప్రతిజ్ఞ
గండీడ్ లో ఏకరూప దుస్తుల పంపిణీ ప్రారంభం MEO, సర్పంచ్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హాజరు
మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్ – GO 97 కి వ్యతిరేకంగా ఉద్రిక్తత
“తెలంగాణలో ఆంధ్రా మీడియా పెత్తనం ఎక్కువైంది” – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కస్తూర్బా పాఠశాలల్లో బాలికలకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఆకస్మిక తనిఖీతో పాఠశాల సిబ్బందిలో కదలిక వచ్చింది.