BB6 TELUGU NEWS CHANNEL
గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలోని 22 పీఎం శ్రీ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు విడుదల చేసింది. ఒక్కో పాఠశాలకు రూ.2.27 లక్షలు చొప్పున మొత్తం రూ.49.94 లక్షలు కేటాయించారు. ఈ నిధులను ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వెంటనే ఖర్చు చేయాలని రాష్ట్ర పీఎం శ్రీ బృందం ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది.
ఈ నిధులతో వార్తాపత్రికలు, మాసపత్రికలు, స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమాలు, కళలు–చేతిపనుల సామగ్రి, ఎకో క్లబ్–మిషన్ లైఫ్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాలను అమలు చేయనున్నారు. అలాగే పాఠశాలల్లో రంగుల చెత్త బుట్టలు, ఎల్‌ఈడీ లైట్లు, నర్సరీ పరికరాలు, ఔషధ మొక్కల తోటలు, కంపోస్టింగ్ యూనిట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఎకో–ఫ్రెండ్లీ గ్రో బ్యాగ్‌ల ఏర్పాటుకు ఈ నిధులను వినియోగించనున్నారు.
అదనంగా, ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు బోధన–అభ్యసన సామగ్రి కోసం ఒక్కో విద్యార్థికి రూ.500, ఉపాధ్యాయులకు రూ.500, విద్యార్థుల గుర్తింపు కార్డుల కోసం ఒక్కో విద్యార్థికి రూ.70 చొప్పున విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య ఆధారంగా ప్రత్యేకంగా నిధులు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని 22 పీఎం శ్రీ పాఠశాలలకు రూ.49.94 లక్షల నిధులు
04
Aug