ఘనంగా జోన్ సోషల్  మీట్  కార్యక్రమం

BB6 TELUGU NEWS CHANNEL
వి సి ఐ కార్యక్రమం లో  భాగంగా మహబూబ్నగర్ పట్టణంలోని వాసవి భవన్ నందు  జోన్ చైర్ పర్సన్ వి ఎన్.సిల్వర్ స్టార్ కే సి జి ఎఫ్ బెండె సత్యవతి జోన్  సోషల్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జి (ఉమెన్ ఎంపవర్మెంట్) కొట్ర శిరీష  హాజరు కావడం జరిగింది. ముఖ్యఅతిథి కొట్ర శిరీష  మాట్లాడుతూ,  ఈ మూడు క్లబ్బులు బాగా పనిచేస్తున్నాయని, ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ వాసవి క్లబ్ సేవలు విస్తృతం చేయాలని, ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని , ప్రతి ఒక్క మీటింగ్ కు అటెండ్ కావాలి అని ఈ సందర్భంగా తెలిపారు.

అతిథి వలకొండ శ్రీదేవి మాట్లాడుతూ, జోన్ చైర్ పర్సన్ బెండె సత్యవతి మూడు క్లబ్బులు బాగా పనిచేస్తున్నాయని, ఎప్పటికప్పుడు తను చేసే కార్యక్రమాలను  వి సి ఐ కి రిపోర్ట్ చేస్తున్నారని, ఆమెకు మంచి గుర్తింపు ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
జోన్ చైర్ పర్సన్ సత్యవతి మాట్లాడుతూ.. మక్తల్ వాసవి క్లబ్,వనిత క్లబ్, మహబూబ్నగర్ వనిత క్లబ్  3 క్లబ్బులు యాక్టివ్ గా పని చేస్తున్నాయని  క్యాలెండర్ ఈవెంట్స్ కంపల్సరీ  పూర్తి చేస్తున్నారని, తను ఊహించిన దాని కంటే  ఎన్నో సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారని, జోన్ విజిట్ అన్ని క్లబ్బులు కంప్లీట్ అయ్యాయని తెలిపారు.  వచ్చిన అతిథులకు ,క్లబ్ ప్రెసిడెంట్, కార్యదర్శి, కోశాధికారులకు జ్ఞాపిక అందజేసి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి  కొట్ర శిరీష, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు  వలకొండ శ్రీదేవి, అలంపల్లి సువర్ణ, మహబూబ్నగర్ వనిత క్లబ్ అధ్యక్షురాలు కండె మహాలక్ష్మి, కార్యదర్శి ఆగిర్ మానస, వాసవి క్లబ్ అధ్యక్షుడు మేడిశెట్టి హరికృష్ణ, కార్యదర్శి కొత్త ఆంజనేయులు కోశాధికారి తాలంపల్లి పవన్ కుమార్, వనిత క్లబ్ అధ్యక్షురాలు కల్వల ప్రసన్న, అతిథులు, తదితరులు పాల్గొన్నారు.