BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్ మండల కేంద్రంలోని ప్రీ ప్రైమరీ స్కూల్ మరియు బాలికల పాఠశాల మధ్యలో గల కరెంటు స్తంభం శిథిలావస్థలో ఉన్న కారణంగా కరెంటు స్తంభం విరిగి ఎప్పుడు కరెంటు తీగలు తెగిపడతాయో అని బిక్కుబిక్కుమంటూ విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు స్కూలు సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. స్కూల్ ఆవరణలో ఉన్న కారణంగా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా స్తంభాలు లేవు లేదా ఇతరత్రా కారణాలవల్ల మార్చలేకపోతున్నామని లైన్మెన్ వివరణ ఇచ్చారు. కానీ బీభత్సమైన గాలులు వర్షాల కారణంగా స్కూలు సమయంలో స్తంభం పూర్తిగా విరిగిపోతుందేమో అన్న భయం లో స్కూల్ సిబ్బంది ఉన్నామని మీడియాతో చెప్పుకొచ్చారు.
కరెంటు సిబ్బంది త్వరిత గతిన చర్యలు తీసుకొని స్తంభాన్ని మార్చాలని గండీడ్ గ్రామం సర్పంచ్ భగవంతురెడ్డి చరవాణి ద్వారా లైన్మెన్ కు ఆదేశించారు.
హెచ్చరిక :
వర్షాల సమయంలో ప్రజలు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, మరియు తెగిపడిన కరెంట్ తీగలకు దూరంగా ఉండాలి. తడిసిన స్తంభాలు లేదా స్టే వైర్ల వల్ల ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్తంభాలను తాకవద్దు: వర్షంలో తడిసిన కరెంట్ పోల్స్, స్టే వైర్లు, మరియు ఇనుప ఫెన్సింగ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకండి.
తీగలకు దూరం: తెగిపడిన విద్యుత్ తీగలు కనిపించినా లేదా చెట్లు వాటిపై పడినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి.
బట్టలు ఆరేయవద్దు: కరెంట్ తీగలు లేదా స్టే వైర్లకు బట్టలు ఆరేసే దారాలు కట్టకండి. అత్యవసర హెల్ప్‌లైన్: విద్యుత్ సమస్యలు లేదా ప్రమాదాల గురించి తెలంగాణలో అయితే TGNPDCL టోల్ ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేసి తెలపండి.
