2000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గ్రామ పరిపాలన అధికారి జగదీష్

BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా దోమ మండలం బ్రేకింగ్ న్యూస్ : రెవెన్యూ శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతి పనికి ఓ రేటు అన్నట్లు వ్యవహార శైలి కొనసాగుతోంది.అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు అందుకు నిదర్శనంగా కనబడుతున్నాయి.
వికారాబాద్ జిల్లా  దోమ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ  అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా  దరఖాస్తుకు చేసుకున్న లబ్ధిదారు నుండి లంచం డిమాండ్ చేయడంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించగా సంబంధిత శాఖ అధికారులు దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం… దోమ మండలం మోత్కూరు గ్రామానికి చెందిన ఎర్రోళ్ల ఎల్లమ్మ అనే లబ్ధిదారు కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోగా అందుకు సంబంధించిన దరఖాస్తు పంచనామా నిమిత్తం మోత్కూరు గ్రామ పరిపాలన అధికారి జగదీష్ లబ్ధిదారు నుంచి 6000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్టు తెలిపారు. అందులో భాగంగా సోమవారం 2000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖ  దృష్టికి తీసుకురావాలని అన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe