వెన్నచేడు SBI బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పి. నరేందర్‌కు ఘన సన్మానం

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలోని వెన్నచేడు ఎస్‌బీఐ శాఖలో విధులు నిర్వహించిన అసిస్టెంట్ మేనేజర్ పి. నరేందర్ బదిలీ సందర్భంగా ఖాతాదారులు ఘనంగా సన్మానించి భావోద్వేగంతో వీడ్కోలు పలికారు. బ్యాంకు మేనేజర్ భాస్కరరావు సమక్షంలో పూలదండలు, శాలువాలతో సత్కరించి, అందించిన సేవలను కొనియాడారు. పి. నరేందర్ తన సేవాకాలంలో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు, నామినీ వివరాలు లేక నిలిచిపోయిన ఖాతాలు, బ్యాంకు నిబంధనల్లో వచ్చిన మార్పులపై అవగాహన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖాతాదారుల సమస్యలను ఓర్పుతో పరిష్కరిస్తూ విశేష సేవలు అందించారు. పెండింగ్ కేసులను ఒక్కొక్కటిగా పరిశీలించి, అవసరమైన పత్రాలపై స్పష్టమైన సూచనలు ఇస్తూ ఖాతాదారులకు రావాల్సిన మొత్తాలు అందేలా కృషి చేశారు.ప్రతి ఖాతాదారుడిని ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను పూర్తిగా విని త్వరితగతిన పరిష్కారం చూపేందుకు కృషి చేయడం వల్ల స్థానిక ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, గ్రామీణ ప్రాంతాల ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ఆయన సేవలతో బ్యాంకుపై ఖాతాదారుల్లో విశ్వాసం మరింత పెరిగిందని పలువురు పేర్కొన్నారు.
బదిలీ సందర్భంగా మాట్లాడుతూ, పి. నరేందర్ అందించిన సేవలను తాము ఎప్పటికీ మరువలేమని, ఆయన లాంటి నీబద్దత కలిగిన అధికారి తమ శాఖ నుంచి వెళ్లిపోవడం బాధాకరమని ఖాతాదారులు భావోద్వేగం వ్యక్తం చేశారు. ఆయన భవిష్యత్ ఉద్యోగ జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ భాస్కరరావు, వెంకట్ రాములు గౌడ్, నర్సింలు, శ్రీనివాస్, వజ్రపతి, ఎజాజ్ పలువురు ఖాతాదారులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe