BB6 TELUGU NEWS CHANNEL
PRTU – TS Gandeed mandal , ZPHS (B) Vennached లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు శ్రీ మదన్ మోహన్ యాదవ్ , మండల అధ్యక్షుడు వి. జనార్ధన్ , ప్రధాన కార్యదర్శి జి రాజేందర్ రెడ్డి గారు, రాష్ట్ర బాధ్యులు శ్రీ L బాల్ రాజు సార్ , మోహన్ రెడ్డి , E. కొండయ్య , S కృష్ణయ్య , E కృష్ణా రెడ్డి, D లక్ష్మయ్య,P బాబు , M కొండయ్య పాల్గొనడం జరుగింది…

జూలై 15న అందరికీ హెల్త్ కార్డులు దసరాలోపు PRC ప్రకటించాలి – సెప్టెంబర్ 1లోపు CPSపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి లేకపోతే ఉద్యమమే.
-PRTUTS జిల్లా అధ్యక్షులు జి. మదన్ మోహన్ యాదవ్
-ముమ్మరంగా సాగుతున్న PRTU-TS సభ్యత్వ నమోదు.
గండీడ్ మండలం: రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులందరికీ జూలై 15న హెల్త్ కార్డులు అందుబాటులోకి తీసుకురావాలని, అలాగే దసరా పండుగలోపు PRC అమలు జరిగేలా చర్యలు తీసుకురావడం PRTU-TS బాధ్యతగా భావించి, *గౌరవ MLC పింగిళి శ్రీపాల్ రెడ్డి సహకారంతో రాష్ట్ర శాఖ నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోందని PRTU-TS మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు జి. మదన్ మోహన్ యాదవ్* పేర్కొన్నారు.
రిటైర్డ్ ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులలో అత్యధిక భాగం ఇప్పటికే చెల్లించగా, మిగిలిన TSGLI తదితర బిల్లులను కూడా త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు *సెప్టెంబర్ 1లోపు CPS రద్దుపై సానుకూల నిర్ణయం ప్రకటించాలని, లేకపోతే PRTU-TS రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ* చేపడతామని హెచ్చరించారు.
అదేవిధంగా *మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద క్రమం తప్పకుండా జీతాలు చెల్లించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్* చేశారు.
ఇదిలా ఉండగా, జిల్లాలో PRTU-TS సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోందని, గండీడ్ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ప్రాథమిక సభ్యులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చురుకుగా కృషి చేస్తున్నారని తెలిపారు. సభ్యత్వ నమోదును ప్రతి ఉపాధ్యాయుడు సద్వినియోగం చేసుకుని సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.