బుడగజంగం బాధిత కుటుంబ సభ్యులకు వంట సరుకులు మరియు 16,500 రూపాయల నగదు అందచేత

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం దేశాయ్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని (నంచర్ల గేట్) దగ్గర బుడగజంగం చిట్టెమ్మ భర్త బుడగజంగం రాములు చనిపోవడంతో కుటుంబం దిక్కు తోచని పరిస్థితి లో ఉంది. విషయం తెలుసుకున్న వెంటనే వాట్సాప్ గ్రూప్ లలో పోస్ట్ పెట్టడం వల్ల చాలామంది వారికీ తోచిన ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మొత్తం 20,000 ( ఇరవై వేల రూపాయలు ) జమ కాగా 3500/- మూడు వేల ఐదు వందల రూపాయల వంట సరుకులు (బియ్యం, ఇతర సామాన్లు) మరియు 16,500/- నగదు బాధిత కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. కార్యక్రమంలో మహమ్మదాబాద్ ఉప సర్పంచ్ ఈ. పవన్ కుమార్, గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కప్లాపూర్ ఆశన్న, ఉమ్మడిగండీడ్ మండల మాజీ జడ్పీటీసీ జంగళ్ళ వెంకటయ్య, కొంరెడ్డి పల్లి ఉపసర్పంచ్ జంగళ్ళ భీమయ్య, జూలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రాంచంద్రయ్య, మహబూబ్ నగర్ జిల్లా బీసీ విద్యార్తి సంఘం అధ్యక్షులు దోమ వెంకటేష్, ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య,మహమ్మదాబాద్ మండల MRPS అధ్యక్షులు దానకారి సురేష్,గండీడ్ మండల అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు హాస్నాబాద్ వెంకటయ్య, గండీడ్ మండల సిటిజన్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అధ్యక్షులు రంగారెడ్డి పల్లి వివేకానంద్,సీనియర్ నాయకులు ఆశిరెడ్డి పల్లి చంద్రయ్య, ముకర్లాబాద్ మైబయ్య టీచర్, చిన్నవార్వాల్ బుడగజంగం రాములు,దీర్సంపల్లి బద్రీనాథ్, కొంరెడ్డిపల్లి అనంతయ్య, జూలపల్లి చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe