జగదీష్ మార్కెట్లో వన్ ప్లస్ నకిలీ ప్రోడక్ట్స్ ను సీజ్ చేసిన పోలీసులు

BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాదీలకు అబిడ్స్ జగదీష్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఫోన్లు, ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ఇక్కడ దొరికినన్ని వెరైటీలు, ఇంత చవక ధరలో మరెక్కడా దొరకవని అంటుంటారు. అయితే…జగదీష్ మార్కెట్ లో భారీ నకిలీ ప్రాడక్ట్స్ రాకెట్ బాగోతం వెలుగులోకి వచ్చింది. సోమవారం ( జూన్ 22 ) వన్ ప్లస్ బ్రాండ్పేరుతో నకిలీ ప్రాడక్ట్స్ విక్రయిస్తున్న రామ్ చౌదరి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఈ క్రమంలో రూ.12 లక్షలు విలువ చేసే నకిలీ వన్ ప్లస్ నెక్ బ్యాండ్స్, యర్ పాడ్స్ చర్జర్స్ , అడపాటర్స్ సీజ్ చేశారు అధికారులు. అబిడ్స్ జగదీష్ మార్కెట్ లో పటేల్ మొబైల్ పేరుతో షాపు నిర్వహిస్తున్నాడు రామ్ చౌదరి. రామ్ చౌదరి గత కొంత కాలంగా వన్ ప్లస్ నకిలీ ప్రోడక్ట్స్ విక్రయిస్తున్న గుర్తించారు అధికారులు.

వన్ ప్లస్ కంపెనీ ప్రతినిధి నాగేశ్వర్ రావు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రామ్ చౌదరి షాప్ పై దాడి చేసి నకిలీ ప్రాడక్ట్స్ సీజ్ చేశారు. అబిడ్స్ పోలీస్స్టేషన్ లో కాపీ రైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe