BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా తాండూరు :
దొంగ దారిన మళ్ళీ అధికారంలోకి రావడానికే డీలిమిటేషన్.
2011 లెక్కల ప్రకారం డీలిమిటేషన్ కు వ్యతిరేకం.
మహిళ బిల్లుకు వంద శాతం మద్దతు ఇస్తాం, కానీ అశాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్న డీలిమిటేషన్ ని వ్యతిరేకిస్తాం.
డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరిగితే పోరాటం చేస్తాం.
తెలంగాణ దేశానికి (కేంద్రానికి) రూ.5 ఇస్తే, తిరిగి తెలంగాణకు రూ.2 మాత్రమే ఇస్తుంది.
తాగునీటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం కోసం కాగ్నా నుండి నీటి సరఫరా కు, అన్ని వార్డుల్లో బోర్లు వేసి త్రాగునీరు అందించడానికి తాండూరు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
కౌన్సిల్ లో అన్ని అంశాలపై చర్చించాం.
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) మరియు నీటి సరఫరాపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుగుతుంది.
తాండూరు సమస్యలపై త్వరగా స్పందించి, నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి తాండూరు ప్రజల తరుపున ధన్యవాదాలు.
తాండూరు మున్సిపల్ కార్యాలయంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మీడియా తో “చిట్ చాట్”
17
Apr