BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిలా తాండూరు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో నేషనల్ గర్ల్స్ చిల్డ్రన్స్ డే. నేషనల్ గర్ల్స్ చిల్డ్రన్స్ డే, జనవరి 24 నుండి ఫిబ్రవరి రెండు వరకు అమ్మాయిలకు బాల్య వివాహాలపై మరియు ఫోక్సో యాక్ట్ పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాను సారం, బుధవారం తాండూర్ పట్టణంలోని సాయిపూర్ లో ఉర్దూ మీడియం గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థులకు బాల్య వివాహాలు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా తాండూర్ ప్యానల్ న్యాయ వాదులు జిలాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఎవరైనా బాల్య వివాహాలు జరిపిన వారిపై చట్టరీత్యా బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం చర్య ఉంటుందని అన్నారు. అమ్మాయిలకు 18 సంవత్సరాలు అబ్బాయిలకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని దీన్ని ఎవరు అతిక్రమించిన చట్టపరంగా చర్యలు ఉంటాయని, వాళ్ళు అన్నారు. ఎవరైనా బాల్య వివాహం చేసిన రెండు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా రెండు కూడా విధించవచ్చని అన్నారు . ఫోక్సో యాక్ట్ 2012 ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఇద్దరికీ కూడా ఈ యొక్క చట్టం వర్తిస్తుందని, ఎవరు కూడా అమ్మాయిలని సెక్సువల్ గా బలవంత పెట్టిన ప్రేరేపించిన సైగల ద్వారా గాని కామెంట్ చేసిన చట్టపరంగా వారికి శిక్ష ఉంటుందని, అన్నారు. ఇది పిల్లలపై జరిగే లైంగిక దాడి నుండి రక్షిస్తుంది. దీనికి రెండు నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. గరిష్టంగా 20 సంవత్సరాల వరకు కూడా కఠిన శిక్ష ఉంటుంది. విద్యార్థులు పాఠశాల దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్ట్ సిబ్బంది ప్రేమ్ కుమార్. హెచ్ఎం రిజ్వానా. ఉపాధ్యాయులు. విద్యార్థిని. విద్యార్థులు పాల్గొన్నారు.
మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో నేషనల్ గర్ల్స్ చిల్డ్రన్ డే
29
Jan