మానేరు వంతెన నిర్మాణ పనులు ప్రారంభం

BB6 TELUGU NEWS CHANNEL
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలో గల మానేరు వంతెనపై రూపు నారాయణపేట – విలాసాగర్ గ్రామాల మధ్య గల మానేరు నదిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మింప తలపెట్టిన వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల గ్రామమైన రూపునారాయణపేట కు మాహర్దశ రానున్నది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక దృష్టి సారించిన పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రూపాయలు 80 కోట్ల నిధుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు ఆయా శాఖల మంత్రులతో మాట్లాడి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ వంతెన నిర్మాణం చేపట్టడం ఎంతో గర్వకారణంగా ఉంది. నియోజకవర్గం ప్రజల మన్ననలు పొందుతూ తనదైన శైలిలో బాల్యంలోనే రూపు నారాయణపేటలో ఉన్న తాను గ్రామ రుణం తీర్చుకొనుటకు గ్రామ అభివృద్ధికి పెద్దపీట వేశారు. రూపు నారాయణపేట – విలాసాగర్ గ్రామాల మధ్య వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో నివసించే దూర భారం తగ్గుతుంది. రూపునారాయణ పేట తో పాటు
పొత్కపల్లి, శానగొండ, గొల్లపల్లి, జీలకుంట, కొమిరే,మడక, మండలకేంద్రమైన ఓదెల, తదితర గ్రామాలకు దూర భారం తగ్గనుంది. దూర ప్రాంతాలైన జమ్మికుంట, హుజరాబాద్, హనుమకొండ, వరంగల్ కు ప్రయాణ సమయం తగ్గుతుందని దీనివల్ల మాకు ఎంతో ప్రయాణ సౌకర్యం కలుగుతుందని రూపు నాన్న పేట గ్రామ ప్రజలతోపాటు ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. వంతెన నిర్మాణానికి కావలసిన సరుకుల రవాణా కొరకు తాత్కాలిక మట్టి రోడ్డు
కై నడుస్తున్న టిప్పర్ల వల్ల గ్రామంలో దుమ్ము పేరుకు పోకుండా వెంట వెంటనే రోడ్డుపై నీటిని పిచికారి చేయాలని గ్రామప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావుకి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఏది ఏమైనా ఈ వంతెన పనులు ప్రారంభం కావడం వెనుక ఎమ్మెల్యే కృషి ఎంతో ఉందని తక్కువ సమయంలోనే ఈ వంతెన నిర్మాణం పూర్తయి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ వంతెన ప్రారంభం కావాలని ఎంతో ఆశతో ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe