మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన గండీడ్ జోనల్  అధికారికి షోకాజ్ నోటీస్ జారీ

BB6 TELUGU NEWS CHANNEL
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన గండీడ్ మండలం లో జోనల్ అధికారికి జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ విజయేందిర బోయి షోకాజ్ నోటీస్ జారీ చేశారు.బుధవారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి  గండీడ్ మండలం లో విశ్వ భారతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను కలెక్టర్ సందర్శించి పోలింగ్ బృందాలకు సామాగ్రి పంపిణీ పర్యవేక్షించారు.కలెక్టర్ ఉదయం 10.30. గంటలకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను కలెక్టర్ సందర్శించిన   సమయంలో జోనల్ అధికారిగా నియమించిన పంచాయతీ రాజ్, ఏ. ఈ గండీడ్  డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు రాక పోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం కారణంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఎన్నికల విధుల్లో నియమించిన అధికారులు,సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.