BB6 TELUGU NEWS CHANNEL :
చెన్నై: చోరీలతో వచ్చే ఆనందమే వేరంటోంది తమిళనాడుకు చెందిన ఓ గ్రామ పంచాయతీ సర్పంచి. 15 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్న ఆమె ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. విచారణలో ఆమె వెల్లడించిన విషయాలు పోలీసులను నివ్వెరపరిచాయి. చెన్నై నెర్కుండ్రానికి చెందిన వరలక్ష్మి అనే మహిళ బస్సులో ప్రయాణిస్తుండగా ఆమె మెడలోని5 సవర్ల బంగారు గొలుసు చోరీకి గురైంది. బాధితురాలు కోయంబేడు పోలీసులను ఆశ్రయించారు.దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరుప్పత్తూరు జిల్లా నరియంపట్టు పంచాయతీ సర్పంచి భారతి (డీఎంకే)ని ఆదివారం అరెస్టు చేశారు. ఆమెను విచారించగా డబ్బు,పలుకుబడి ఉన్నా, చోరీ చేసినప్పుడు వచ్చే ఆనందమేవేరని, అందుకే 15ఏళ్లుగా దొంగతనాలు చేస్తున్నానని చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు.
దొంగతనంతో వచ్చే కిక్కేవేరబ్బా!.. 15 ఏళ్లుగా పంచాయతీ సర్పంచి దొంగతనాలు
09
Sep