BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రం లో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట లేకుండా పోతుంది. మండల కేంద్రంలోని రంగారెడ్డి పల్లి వాగు లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇందిరమ్మ ఇండ్ల వంకతో ఇతర మండలాలకు సాఫీగా ఇసుక తరలింపులు జరుగుతున్నాయి. రోజుకు 30 నుండి 40 డాక్టర్ల ఇసుక తరలింపులు జరుగుతున్నా చర్యలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్న ప్రజలు.
యువతను చిదిమేస్తున్న ఇసుక మాఫియా..
రాత్రిళ్ళు ట్రాక్టర్లకు డ్రైవర్లుగా యువతను ఉపయోగిస్తూ సొమ్ము చేసుకుంటున్న దళారులు.. రాత్రిళ్ళు ట్రాక్టర్లు నడుపుతూ పగలు మత్తుకు బానిసలు అవుతున్నారు. ఇసుక పర్మిషన్లు ఆన్లైన్ కావడంతో అధికారుల కన్నుగప్పి రాత్రుళ్ళు చెలరేగిపోతున్న ఇసుక దళారులు..
చర్యలు ఎక్కడ..?
ప్రతిరోజు రాత్రి వేళల్లో భారీగా ఇసుక తరలిస్తున్నా పోలీస్ యంత్రాంగం గాని రెవెన్యూ యంత్రాంగం గాని చర్యలు తీసుకోవడం లేదు. గ్రామస్తులు అడ్డుకొని ప్రశ్నిస్తే పోలీస్ పర్మిషన్ తీసుకున్నామని బెదిరింపులకు పూనుకుంటున్నారు.
చూసి చూడనట్టుగా అధికార యంత్రాంగం..
గండీడ్ మండల కేంద్రం రంగారెడ్డి పల్లి వాగు లో ఉన్న లక్షల టన్నుల ఇసుక ఇతర మండలాలకు అనగా దోమ మండలం మరియు కులక్చర్ల మండలాలకు కూడా యథేచ్ఛగా ఇసుక తరలింపు జరుగుతున్నా పట్టించుకునే నాధుడు కరువాయే.
లక్షల్లో సంపాదిస్తున్న ఇసుక దళారులు..
ఒక్కో ట్రాక్టరుకు 4000 నుండి 5000 వరకు వసూలు చేస్తు లక్షల్లో సంపాదించుకుంటూ యువత ను డ్రైవర్లుగా క్లీనర్లుగా పెట్టుకొని ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
తూతూ మంత్రంగా చర్యలు.. ప్రాణాలు పోతే గాని చర్యలు ఉండవా.?
గండీడ్ మండలం రంగారెడ్డి పల్లి వాగు నుంచి తరలిస్తున్న ఇసుకకు అధికారులను కాపలాగా
ఉంచుతున్న సమయంలో ఎలాంటి తరలింపులు లేకుండా జాగ్రత్త పడుతున్న దళారులు. ఇంత జరుగుతున్నా రాత్రి వేళల్లో కానరాని పోలీసుల జాడ.? తరలింపు సమయంలో వస్తున్న శబ్దానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు చెవులు మూసుకుని నిద్ర పట్టక అవస్థలు పడుతున్నామని మొరపెట్టుకుంటున్నారు.
మొదటి ఇందిరమ్మ ఇళ్ల పథకం పూర్తి కాకముందే అందని ద్రాక్షగా ఇసుక …
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల కోసం వాడాల్సిన ఇసుక పక్క మండలాలకు తరలిపోతున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్న పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు..మరి రెండో విడతకు ఇసుక పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలా అని ప్రశ్న..
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లకు..
ఫిట్నెస్…………………నో
ట్రాక్టర్ కు నంబర్ …….నో
ట్రాక్టర్ ట్రాలీ కి నంబర్ నో
డ్రైవింగ్ లైసెన్స్ ……..నో
ఇన్సూరెన్స్ …………..నో
పరిమిషన్స్ …………..నో
ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొకపోవడానికి కారణాలు అర్థం కావడం లేదని పై అధికారాలు రాజకీయ వేత్తల ఒత్తిడితో శతమతమవుతున్నారని తెలుస్తుంది.
ఇకనైనా కఠినమైన చర్యలు తీసుకొని ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసి యువతను కాపాడుకుంటారని కోరుకుంటున్న ప్రజలు.