గండీడ్ మండలంలో 10వ తరగతి (SSC) పరీక్షలకు హాజరుకాబోతున్న విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన మండల కాంగ్రెస్ నాయకులు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలో పదవ తరగతి ( SSC ) పరీక్షలకు హాజరు కాబోతున్న విద్యార్థినీ విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి సర్పంచుల సంఘం అధ్యక్షులు ర్యాగరి భగవంతు రెడ్డి. వెంకన్న గౌడ్

భవిష్యత్తుకు తొలిమెట్టుగా ఈ పరీక్షలను ప్రతి విద్యార్థి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని కోరారు. భయం, ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని, మీలోని ప్రతిభను నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థినీ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

పరీక్షలకు  అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉజ్వలమైన భవిష్యత్తుకు ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.