BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి కీలక చర్య తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.బోథ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) టి. ప్రణయ్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద హరితహారం ప్రాజెక్టుకు నీరు సరఫరా చేసిన ఫిర్యాదుదారునికి రావాల్సిన రూ. 5,09,000 బకాయి చెక్కును మంజూరు చేయడానికి రూ. 15,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.ఈ క్రమంలో జూనియర్ అసిస్టెంట్ ఎస్. పరశురాం ద్వారా ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా, ముందస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన ACB అధికారులు వారిని పట్టుకున్నారు.
అధికారులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన FRO సహా ఇద్దరు అధికారులు
11
Apr