లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..అబ్బ.. చల్లని కబురు వచ్చేసింది.. 3 రోజులు వర్షాలే వర్షాలు..

నైరుతి రుతుపవనాల విస్తరణ, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌కు అలెర్ట్‌ జారీ చేసింది. వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని వెల్లడించింది.
నైరుతి రుతుపవనాల విస్తరణ, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌కు అలెర్ట్‌ జారీ చేసింది. వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:-
శనివారం ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ, ఆసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముంది.

రాయలసీమ :-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe