BREAKING NEWS : BRS మాజీ MLA బాల్క సుమన్‌ అరెస్ట్!

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు శనివారం ఉదయాన్నే అరెస్ట్ చేశారు. సింగరేణి సంస్థపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులోనే ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు శనివారం ఉదయాన్నే అరెస్ట్ చేశారు. సింగరేణి సంస్థపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులోనే ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు.

ఇటీవల సింగరేణి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలంటూ బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలందరూ మిలిటెంట్ తరహాలో ఉధృత పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ నమోదైన కేసుల ఆధారంగానే పోలీసులు ఈ రోజు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బాల్క సుమన్ అరెస్ట్ వార్తతో నాంపల్లి కోర్టు పరిసరాల్లో పోలీసుల బందోబస్తును భారీగా పెంచారు.

మరోవైపు తన అరెస్ట్ వార్తలను మాత్రం బాల్క సుమన్ ఖండించారు. తాను తెలంగాణ భవన్‌లోనే ఉన్నానని, అరెస్టు చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe