వనపర్తి: లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన పోస్టల్ ఇన్ స్పెక్టర్

BB6 TELUGU NEWS CHANNEL
తోటి ఉద్యోగుల నుంచి రూ. 30 లంచం తీసుకుంటూ వనపర్తి పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపినాథ్‌ సీబీఐకి చిక్కాడు. 40 మంది ఉద్యోగులకు సంబంధించి ఓటీ విధులకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండా పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపినాథ్‌ ఇబ్బందులకు గురి చేయడంతో చిరు ఉద్యోగులు సంబంధిత సీబీఐ, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.

పరారీలో సూపరింటెండెంట్‌
వనపర్తి టౌన్‌, మే 8 : తోటి ఉద్యోగుల నుంచి రూ. 30 లంచం తీసుకుంటూ వనపర్తి పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపినాథ్‌ సీబీఐకి చిక్కాడు. 40 మంది ఉద్యోగులకు సంబంధించి ఓటీ విధులకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండా పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపినాథ్‌ ఇబ్బందులకు గురి చేయడంతో చిరు ఉద్యోగులు సంబంధిత సీబీఐ, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వనపర్తి పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపినాథ్‌ ఓ ఉద్యోగి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా గురువారం సా యంత్రం సీబీఐ అధికారులు పట్టుకునే ప్ర యత్నం చేశారు.

ఈ పరిణామాలను పసిగట్టిన పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపినాథ్‌ తాను తీసుకున్న డబ్బులను ట్రెజరర్‌కు ఇచ్చి కార్యాలయం గోడదూకి ఆటోలో పరారయ్యాడు. ఫోన్‌ సిగ్నల్‌ ద్వారా గోపినాథ్‌ కొత్తకోట మదనాపురం రోడ్డు వద్ద నిలిచి ఉన్నట్టు గుర్తించిన సీబీఐ అధికారులు అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకుని వనపర్తి పోస్టల్‌ కార్యాలయానికి తీసుకువచ్చారు. రాత్రి అంతా విచారణ జరిపి శుక్రవారం ఉదయం రిమాండ్‌కు తరలించారు. పోస్టల్‌ సూపరింటెండెంట్‌ పరారీలో ఉన్నట్టు గుర్తించారు.