BB6 TELUGU NEWS CHANNEL
ఒక పక్క ఏఐతో అద్భుతాలు సృష్టిస్తోంటే…కొంతమంది మూఢనమ్మకాల ఊబిలోనే ఉండిపోయారు. ఈ రోజుల్లో కూడా క్షుద్రపూజలు, చేతబడులను ఆశ్రయించేవారు ఉన్నారంటే నమ్ముతారా…? వికారాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన చుస్తే నమ్ముతారు. వికారాబాద్ జిల్లా తాండూరులో చేతబడి కలకలం రేగింది. కూతురు ప్రేమ పెటాకులు కావాలని.. కూతురిపైనే చేతబడి చేయించింది ఓ తల్లి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన ఇందిరా ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. అయితే కూతురు ప్రేమ పెటాకులు కావాలని తల్లి సాయమ్మ తాండూరు పట్టణానికి చెందిన మంత్రగాడిని సంప్రదించింది. కాలనీ వాసుల జోక్యంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.ఈ క్రమంలో శుక్రవారం ( మే 1) ఉదయం తెల్లవారుజామున పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలో నిర్మానుష్య ప్రదేశంలో అమ్మాయిని కూర్చోబెట్టి క్షుద్ర పూజలు చేస్తుండగా చూసిన కాలనీ వాసులు ఇక్కడఏం చేస్తున్నావని ప్రశ్నించారు. విషయాన్ని అర్థం చేసుకొని కాలనీ వాసులు కొందరు మంత్రగాడికి దేహాశుద్ధి చేశారు. ఈ విషయం కాలనీ వాసుల జోక్యంతో తాండూరు పట్టణ పోలీసుస్టేషన్ కు చేరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
కూతురు ప్రేమ పెటాకులు కావాలని…తల్లి క్షుద్రపూజలు..!తాండూరులో చేతబడి కలకలం
01
May