పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 29 లేదా 30న విడుదల

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ : పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 29 లేదా 30న విడుదల కానున్నాయి. ఈమేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 14 నుంచి ప్రారంభమైన ప్రధాన పరీక్షలు ఈ నెల 13న పూర్తయ్యాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 23వ తేదీతో జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయింది. మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ముందు నుంచి చెబుతున్నా… ఇప్పుడు ఈనెల 29న విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. అందుకు ప్రభుత్వం సైతం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఒకవేళ వీలుకాని పరిస్థితుల్లో 30న వెల్లడిస్తారు. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు హాజరై ఫలితాలను విడుదల చేయనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe