BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో రంజాన్ పండుగ ఘనంగా జరుపుకున్న ముస్లిం సోదరులు. సర్పంచ్ ఎన్నికల్లో ముస్లిం సోదరులకు ఇచ్చిన మాట ప్రకారం ఈద్గాకు మరమ్మతులు సిసి రోడ్లు వేయించిన గ్రామ సర్పంచ్ గండీడ్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆర్ భవంత్ రెడ్డి. గ్రామ సర్పంచ్ ,ఉప సర్పంచ్ ,వార్డ్ మెంబర్ లు కుర్తా పైజామాతో తలపై టోపీ ధరించి మతాల కతీతంగా మానవత్వాన్ని చాటుకున్నారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని అందరూ ప్రసంగాలు ఇస్తుంటారు, కానీ గండీడ్ గ్రామ సర్పంచ్ ఆర్ భవంత్ రెడ్డి, ఉప సర్పంచ్ గుముడాల చెన్నయ్య ,వార్డ్ మెంబర్స్ మోర హనుమంతు, పశుల ప్రమీల, మైబు, కొమ్ము చెన్నమ్మ , మల్లయ్య, హస్నాబాద్ చంద్రయ్య ,వేపూరి వెంకటయ్య , అందరూ కుర్తా పైజామా తో ముస్లిం సోదరులతో కలిసిపోయారు. జుమ్మా మజీద్ నుండి ఈద్గా వరకు ర్యాలీలో పాల్గొని ,ఇస్లాం మున్సబ్ ప్రవక్త ప్రార్థనలు విన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ శ్రీనివాసరెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ, BRS మండల నాయకులు పట్లోళ్ల రమేష్ రెడ్డి, ఆర్ శేఖర్ రెడ్డి ,ముస్లిం పెద్దలు, యువకులు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


