కరీంనగర్‌లో విషాదం: భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య

BB6 TELUGU NEWS CHANNEL
కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదానికి దారి తీసింది. నాలుగు రోజుల క్రితం ఆయన భార్య దివ్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో మానసికంగా కుంగిపోయిన చంద్రశేఖర్, భార్య మృతిని తట్టుకోలేక అత్తగారి ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం.దివ్య మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని జమ్మికుంట ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe