BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. సమాజంలోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా ఒకేసారి 9 సరికొత్త సంక్షేమ పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. విద్య, వైద్యం, ఉపాధి మరియు సామాజిక భద్రతే లక్ష్యంగా ఈ పథకాలను రూపొందించారు.
పథకాల పూర్తి వివరాలు:
1..ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం: పేద కుటుంబాల జీవన ప్రమాణాలను పెంచేందుకు, వారి ఆర్థిక అవసరాలకు అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
Related News
BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన NEHS (న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్) అమలు ప్రాసెస్ జరుగ...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రం ప్రభుత్వ కళాశాలలో PACS చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి ని, వైస్ ఛైర్మన్ కమతం విష్ణువర్ధన్ రె...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు K M నారాయణ పై కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL “అందెశ్రీ.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కవిగా, గాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా పరిచయం ఉండొచ్చు.. కానీ నాకు మాత్రం ఉద్యమకారుడే కాదు.....
Continue reading
•రైతు రాజ్యమే కాంగ్రెస్ లక్ష్యం•9 రోజుల్లోనే ₹9,000 కోట్ల 'రైతు భరోసా'•ఖమ్మం వేదికగా 'రైతు ఆశీర్వాద సభ'•రేపే రైతుల ఖాతాల్లోకి మరో ₹1,900 కోట్లు•వ్యవసాయాన్ని ప...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అంద...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అన...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. మంగళవారం తొలి విడతలో భాగంగా రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణలో రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా సభలో రూ.2...
Continue reading
వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతుల....•తొలుత 2 ఎకరాల వరకు ఉన్న రైతులకే•41.37లక...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు ఈగల్ ఫోర్స్ కు ఫుల్ పవర్స్ డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు డ్రగ్స్ రహిత తెలంగాణే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ హైదరాబాద్ (గాంధీభవన్)* శ్రీరామచంద్రుడు ఏమన్నా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాగీరా అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ...
Continue reading
2..చేయూత: వృద్ధులు, వితంతువులు మరియు ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయనున్నారు.
3..తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు: కార్పొరేట్ స్థాయి విద్యను సామాన్యులకు చేరువ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో కూడిన ప్రభుత్వ పాఠశాలల స్థాపన.
4..విద్యార్థులకు ఉచిత బ్రేక్ ఫాస్ట్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఉదయం పూట నాణ్యమైన అల్పాహారాన్ని అందించనున్నారు.
5..నగదు రహిత ఆరోగ్య భద్రత: సామాన్యుడిపై వైద్య ఖర్చుల భారం పడకుండా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స పొందే సౌకర్యం.
6..ఉద్యోగుల ప్రమాద బీమా: ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు భద్రత కల్పిస్తూ, విధి నిర్వహణలో లేదా ప్రమాద వశాత్తూ జరిగే నష్టాలకు భారీ బీమా రక్షణ.
7..సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్: విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందాలనుకునే నిరుద్యోగ యువతకు శిక్షణ, ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించడం.
8..ఏటీసీ ట్రైనీలకు స్కాలర్‌షిప్స్: సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న ఏటీసీ ట్రైనీలకు చదువులో వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌ల మంజూరు.
9..ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: ఇప్పటివరకు పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింపజేయనున్నారు.
ఈ పథకాల అమలుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ ఫలాలు అందేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
Views: 38
Advertisements