ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి..హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నిరసనలు..

BB6 TELUGU NEWS CHANNEL
అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఖమేనీ మృతిపై హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నిరసనలు వెల్లువెత్తాయి. ఓల్డ్ సిటిలోని పురానిహవేలీలో తంజీమ్ ఈ జాఫెరీ సంస్థ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇజ్రాయెల్ ముర్దాబాద్, నేతన్యాహు మూర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు ముస్లింలు. భారీ సంఖ్యలో ముస్లిం మత పెద్దలు.. స్థానికులు ఈ నీరసనలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వందలాది మంది ముస్లింలు రోడ్డుపైకి వచ్చి నిరసనకు దిగారు. ర్యాలీ సమయంలో ఓల్డ్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఇరాన్ మీడియా అధికారికంగా ధృవీకరించింది. తన్నిమ్ న్యూస్ ఏజెన్సీ, ఫార్ట్స్ న్యూస్ ఏజెన్సీ వంటి ప్రధాన ఇరానియన్ వార్తా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేశాయి.

ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు తెలిపాయి. ఖమేనీ కూతురు, అల్లుడు,కోడలు, మనుమడు చనిపోయినట్లు పేర్కొంది. సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా శనివారం (ఫిబ్రవరి 28) ఇరాన్ పై భీకరదాడులు చేశాయి. ఖమేనీ నివాసమే లక్ష్యంగా మిస్సెళ్లతో విరుచుకుపడ్డాయి. దాదాపు 30బాంబులతో దాడి చేసినట్లు సమాచారం.ఈ అటాక్స్ లో ఖమేనీ నివాసం తునాతునకలైంది. ఈ క్రమంలో ఖమేనీ సేఫ్ గా ఉన్నారని.. అమెరికా, ఇజ్రాయెల్దాడులకు ముందే ఆయనను సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది.

కానీ ఆదివారం (మార్చి 1)తెల్లవారుజూమున ఖమేనీ మరణంపై ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో ఖమేనీ మరణించినట్లు ప్రకటించాడు.“చరిత్రలో అత్యంత దుర్మార్గులలో ఒకరైన ఖమేనీ చనిపోయాడు. మా ఇంటెలిజెన్స్,అత్యంత అధునాతన ట్రాకింగ్ వ్యవస్థలను అతడు తప్పించుకోలేకపోయాడు. ఈ చావుతో ఇరాన్, అమెరికా, బాధితదేశాలకు న్యాయం జరిగింది. ఖమేనీతోపాటు ఇతర ఇరాన్ అగ్ర నాయకులుకూడా హతమయ్యారు. ఇరాన్ ప్రజలుతమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ సుప్రీమ్ లీడర్ మరణించినట్లు ధ్రువీకరించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe