BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో ఆర్మీ జవాన్ కీర్తిశేషులు తోకని శ్రీనివాస్ విగ్రహావిష్కరణ సంబందించిన పోస్టర్ ఘనంగా విడుదల చేయడం జరిగింది
వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్ గ్రామ వాస్తవ్యులు ఆర్మీ జవాన్ కీర్తిశేషులు తోకని శ్రీనివాస్ విక్రవిష్కరణ కార్యక్రమం వారి స్వగ్రామమైన దాదాపూర్ లో ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి మన ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో తరలివెళ్లి ప్రోగ్రాంను విజయవంతం చేద్దాం. అని గండీడ్ మండల నాయకులు పిలుపు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎంపిటిసి కప్లాపూర్ ఎం.ఆశన్న, కప్లాపూర్ మొగులయ్య గౌడ్, గండీడ్ మండల సీనియర్ నాయకులు కొప్పుల శ్రీధర్,పరిగి నియోజకవర్గ నాయకులు అంజి రావణ్, ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, మండల సీనియర్ నాయకులు చిట్లపల్లి మల్కన్న, గండీడ్ మండలం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు హస్నాబాద్ వెంకటయ్య,గండీడ్ మండల ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి రంగారెడ్డిపల్లి జే.వివేకానంద్, పగిడ్యాల్ ఎం.నారాయణ, బాలయ్య, దాదాపూర్ దస్తయ్య, వెంకటయ్య,రామ్ రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కీర్తిశేషులు ఆర్మీ జవాన్ విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల
27
Feb