శ్రీ సత్య సాయి సేవా సమితి వెన్నచెడ్ ఆధ్వర్యంలో ఉచిత చెవి చికిత్స శిబిరం

BB6 TELUGU NEWS CHANNEL
వెన్నచేడ్ గ్రామంలో శ్రీ సత్య సాయి సేవా సమితి మహబూబ్నగర్ జిల్లా వారి ఆధ్వర్యంలో మన వెనచేడ్ సత్యసాయి మందిరంలో SAHI(Society to aid the hearing impaired) హైదరాబాద్ వారిచే చెవికి సంబంధించిన వ్యాధులకు ఉచిత చికిత్స శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 95 మంది పేషంట్లు చికిత్స పొందడం జరిగింది, దాదాపు 20 మందికి చెవికి సంబంధించిన మిషన్లు కూడా వారు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సాయిబాబా , జిల్లా యూత్ కోఆర్డినేటర్ వెంకట రాములు, మహబూబ్నగర్ జిల్లా సాయి పెద్దలు , వెన్నాచెడ్ సేవాసమితి కన్వీనర్ నారాయణ రెడ్డి మరియు సేవ సమితి పెద్దలు శివ మల్లప్ప, సమితి పెద్దలు యువకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు, ఈ కార్యక్రమంలో సేవ అందించినటువంటి డాక్టర్లు అందరికీ సహకరించిన సాయి బంధువులందరికీ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా వెన్నచేడ్  సేవా సమితి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe