ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్‌పై అవినీతి ఆరోపణలు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ నివాసంలో ఏసీబీ సోదాలు..

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని కేసు నమోదు చేసిన ఏసీబీ.. రూ. 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు అనుమానిస్తున్న ఏసీబీ.. డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ కు చెందిన ఆస్తులపై ఏసీబీ ఆరా.. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు మొత్తం 12 చోట్ల ఏసీబీ సోదాలు..

భారీగా ఆస్తులు కూడబెట్టిన ట్రాన్స్‌పోర్ట్‌ డిప్యూటీ కమిషనర్‌ కిషన్‌ నాయక్‌. దాదాపు రూ.400 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు నిర్ధారణ. హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంక్‌లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, అపార్ట్‌మెంట్లు, ఇళ్లు, ఇంటి స్థలాలు గుర్తింపు. ట్రాన్స్‌పోర్ట్ శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు విచారణలో తేలింది. ఆయన వద్ద దాదాపు రూ.400 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం.
విచారణలో భాగంగా హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు షాపింగ్ కాంప్లెక్స్‌లు అపార్ట్‌మెంట్లు విలాసవంతమైన ఇళ్లు ఇంటి స్థలాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఆస్తులు ఆయన ఆదాయానికి మించినవిగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ వ్యవహారంపై ఏసీబీ తెలంగాణ విస్తృత దర్యాప్తు కొనసాగిస్తోంది. ఆస్తుల కొనుగోలు, లావాదేవీలు, బినామీ లింకులపై లోతైన విచారణ చేపట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.అవసరమైతే మరిన్ని కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.