BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా,గండీడ్ మండల అభివృద్ధి అధికారి MEO గారికి చేయు మనవి శ్రీ కుడుముల కొండయ్య , విశ్రాంత ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల, రెడ్డిపల్లిలో పనిచేస్తూ గత సంవత్సరం సెప్టెంబర్ 2, 2024 న పదవీ విరమణ చేశారు. ఆయన విద్యా సేవలకు 25 సంవత్సరాలకు పైగా సమయం అంకితమిచ్చి, ఎన్నో తరాల విద్యార్థులను తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఆయన తీవ్రమైన ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గత 14 రోజులుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నవోదయ ఆసుపత్రిలో ICU లో చికిత్స పొందారు. రోజుకు సుమారు ₹20,000 చొప్పున ఖర్చు కాగా, ఇప్పటివరకు మూడు లక్షలకు పైగా వైద్య ఖర్చులు అయ్యాయి. అప్పులు చేసి ఈ ఖర్చులు భరించారు ఇప్పుడు ఇక భరించే స్థితిలో లేరు.దురదృష్టవశాత్తూ, ఆయన రిటైర్మెంట్ అయిన 14 నెలలు గడిచినా ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ (గ్రాట్యుటీ, పెన్షన్, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ మొదలైనవి) అందలేదు. దీంతో ఆయనకు సరైన వైద్యం చేయించేందుకు ఏమాత్రం ఆర్థిక వనరులు లేక కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు . ప్రస్తుతం ఆయన ఇంట్లో ఆక్సిజన్ మీదనే ఉన్నారు.కాబట్టి, తక్షణం ఆయనకు రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను విడుదల కావాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని మొరనెత్తుకుంటున్నాము…
ధన్యవాదములతో,
Note:
GPF Token No. 252350447, dt.18.12.2024,
Final ELs . Token No. 2522895518, Dt. 09.10.2024
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే మంజూరు చేయగలరని గౌరవ శ్రీ మండల అభివృద్ధి అధికారిని వేడుకున్న..
16
Oct