ఇవాళ (సెప్టెంబర్ 16) అర్థరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్?

BB6 TELUGU NEWS CHANNEL :
బకాయిలు చెల్లించకుంటే ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో నేటి(మంగళవారం) అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ పెడ్తామని తెలంగాణ ఆరోగ్య శ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోషియేషన్(టీఏఎన్ హెచ్ఎ)హెచ్చరించింది. గత కొన్ని నెలలుగా బకాయిలు పేరుకు పోయాయని, దీంతో నెట్ వర్క్ ఆస్పత్రులు ఆర్థిక కష్టాల్లో కూరుకు పోయాయని పేర్కొంది.

ఇదిలా ఉంటే, సోమవారం ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.100 కోట్లు విడుదల చేసినట్లు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. అయితే, నెట్ వర్క్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్లు మాత్రం బంద్ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. మొత్తం రూ.1400 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, మొత్తం క్లియర్ చేయాలని టీఏఎన్ హెచ్ఎ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ వద్దిరాజు రాకేశ్ ప్రభుత్వానికి రిక్వెస్ట్
చేశారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe