సెప్టెంబర్ 10 తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

BB6 TELUGU NEWS CHANNEL : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ(ఆగస్టు 31) ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘లిల్లీపుట్ అని కవిత జగదీశ్ రెడ్డి పరువు తీసింది. నల్లగొండకు నీళ్లు రాకుండా ఎండ బెట్టిండు. కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలి.కేంద్రం ఇవ్వక పోవడంతో ఇబ్బంది అవుతుంది. వరి విస్తీర్ణం పెరగడం వల్ల యూరియా వాడకం పెరిగింది. సెప్టెంబర్30 లోపు ఎలక్షన్ ముగుస్తుంది’ అని తెలిపారు.

సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో ప్రభుత్వ ఆ దిశగా ముందు కెళ్తంది.తెలంగాణ పంచాయతీ రాజ్ చట్ట 2018 సవరణ చేసిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశ పెట్టింది.అసెంబ్లీ తర్వాత ప్రత్యేక జీవో తెచ్చి కులగణన ఆధారంగా తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తోంది.నాడు ఎస్టీలకు ఇచ్చినట్టే..ప్రస్తుతం విద్యా, ఉద్యోగాలలో రాష్ట్రంలోఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు29%, ఈడబ్ల్యూఎస్కు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 64 శాతం అమలవుతున్నాయి. గతంలో ఎస్టీల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి గవర్నర్ కు పంపగా దాన్ని రాష్ట్రపతికి పంపారు.అక్కడ ఆమోదం లభించక పోయినా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చింది.

అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4)ప్రకారం జనాభాకు అనుగుణంగా ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లను పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేలా 105వ రాజ్యాంగ సవరణ ద్వారా 342(ఎ)ఆర్టికల్ లో మార్పు చేశారు. దీంతో రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవోకు కేంద్రం ఆమోదం అవసరం లేదు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పెంపు సాధ్యమైందనే వాదన కూడా ఉన్నది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ ప్రభుత్వం అలాగే చేయనుంది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe