తెలంగాణ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ఆగస్టు 20 వరకు బీభత్సం

BB6 TELUGU News CHANNEL
తెలంగాణకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. తాజా బులెటిన్ ప్రకారం రేపు ఉదయం 8:30 గంటల వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ మూడు జిల్లాల్లో 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD స్పష్టం చేసింది. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆగస్టు 22 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని IMD హెచ్చరించింది.తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారత వాతావరణ శాఖ తెలంగాణకు మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేసింది.

IMD లేటెస్ట్ బులెటిన్ ప్రకారం.. ఈరోజు ఉదయం 8:30 నుండి రేపు ఉదయం 8:30 వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇప్పటికే ములుగు జిల్లా మంగపేటలో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

అంతేకాదు.. ఆగస్టు 20 వరకు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు.

మొత్తానికి తెలంగాణలో ఆగస్టు 22 వరకు వర్షాలు దంచికొట్టనున్నాయి. రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. తెలంగాణ వర్షాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం BB6 తెలుగు న్యూస్ చూస్తూ ఉండండి.