మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన కావలి పెంటయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కరెంటు తీగల పై పడి మృతి చెందాడు. మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శేఖర్ రెడ్డి ఇచ్చిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో జిన్నారం గ్రామానికి చెందిన కావలి పెంటయ్య అనే వ్యక్తి తన పొలంలో పడి ఉన్న విద్యుత్ తీగలపై కాలు మోపడంతో విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.
మృతుని భార్య అయిన కావలి వెంకటమ్మ ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శేఖర్ రెడ్డి మీడియాకు తెలిపారు.
గండిడ్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన రైతు విద్యుత్ తీగలు తగిలి మృతి
01
Aug