డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు చిక్కితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు ,రాజీ లేదు, పోలీసుల హెచ్చరిక
BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి జానకి ఆదేశాల మేరకు మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి మద్యం సేవించి టిప్పర్ను నడుపుతున్న శివరాం సన్ ఆఫ్ నరసింహులు అనే వ్యక్తి పైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి మహబూబ్నగర్ సెకండ్ క్లాస్ కోర్టు ఎదుట హాజరు పరచగా గౌరవ సెకండ్ క్లాస్ కోర్టు జడ్జి శశిధర్ మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి మూడు వేల రూపాయల జరిమానా మరియు ఐదు రోజుల జైలు శిక్ష విధించడమైనది.
మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా ప్రాణహాని ,కుటుంబాలు విచ్చిన్నంతోపాటు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పోలీసులు అరెస్టు చేస్తే జరిమానా మరియు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కావున చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వడం తాగే వాహనాలు నడపడం చట్టరీత్యాగ్నరం కావున తగు జాగ్రత్తలు పాటించాలని సూచించిన మహమ్మదాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి.