SIR ఎన్యూమరేషన్ ఫారాలను సొంత గ్రామం వెన్నాచేడ్ లో అధికారులకు అందజేసిన బిజెపి రాష్ట్ర నాయకులు డా. వెన్న ఈశ్వరప్ప
BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచేడ్.రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా, నేడు గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ జరిగింది. సేవారత్న అవార్డు గ్రహీత, బిజెపి రాష్ట్ర నాయకులు డా. వెన్న ఈశ్వరప్ప తన సొంత గ్రామమైన వెన్నచేడ్ బూత్ నంబర్ 53 లో స్వయంగా తన ఓటరు సవరణ ఫారాలను పూర్తి చేశారు. అనంతరం ఈ ఫారాలను గ్రామ పంచాయతీ కార్యదర్శి, బిఎల్ఏ (BLA), మరియు మండల ఆర్ఐ (RI)కి అందజేశారు.
ఈ సందర్భంగా డా. వెన్న ఈశ్వరప్ప మాట్లాడుతూ.. ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కు అనేది ఒక శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా ఈ ప్రక్రియ సాగాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, చనిపోయిన వారి పేర్లను మరియు డబుల్ ఓట్లను నిబంధనల ప్రకారం వెంటనే తొలగించాలని అధికారులను కోరారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరి ఎన్యుమరేషన్ ఫారంలు పూర్తి చేయడంలో సహకరించి వాటిని స్వీకరించి ప్రతి ఓటును జాగ్రత్తగా జాబితాలో సవరణ చేయవలసినదిగా కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు, యువకులు,గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు వెన్నచేడ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.