Breaking Newsటీజీపీఎస్సీ నుండి మరో నోటిఫికేషన్ విడుదల, ఈనెల 15 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు

BB6 TELUGU NEWS CHANNEL
TGPSC Town Planning Assistant Recruitment : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నుంచి టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు జూలై 15 నుంచి ఆగస్టు 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మరో శుభవార్త చెప్పింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో స్టేట్ లెవల్‌లో 2 పోస్టులు, మల్టీజోన్ పరిధిలో 5 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు..
అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 15, 2026 నుంచి ఆగస్టు 22, 2026 సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షను అక్టోబర్ 2026లో నిర్వహించేందుకు తాత్కాలికంగా షెడ్యూల్ ఖరారు చేశారు. పరీక్ష తేదీకి 7 రోజుల ముందు నుండి హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బి.ప్లానింగ్ లేదా బి.టెక్ ప్లానింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
జూలై 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుండి 44 ఏళ్లకు పెంచారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,320 నుంచి రూ. 1,27,310 జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1000 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500 గా నిర్ణయించారు. అన్ని కేటగిరీల అభ్యర్థులు అదనంగా రూ.120 పరీక్షా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అర్హత గల అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్
https://www.tgpsc.gov.in/

హోం పేజీలోని టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల లింక్ పై క్లిక్ చేయాలి.

ఇక్కడ టీజీపీఎస్సీ ఐడీ(ఓటీఆర్), పుట్టిన తేదీ వివరాలు, క్యాప్చాను నమోదు చేయాలి.

సబ్మిట్ చేస్తే సంబంధిత నోటిఫికేషన్ కు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది.

వివరాలను ఎంట్రీ చేసిన తర్వాత చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ పూర్తవుతుంది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe